KIMS Hyderabad : Dasari Narayana Rao Passed away దర్శకరత్న, సినీ ఇండస్ట్రీ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం (మే 30) సాయంత్రం ఏడు గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో జాయిన్ అయిన ఆయనకు అన్నవాహికకు శస్త్రచికిత్స జరిగింది. అయినా ఫలితంలేదు. ఐదు నెలల్లో ఆయనకు ఐదుసార్లు ఆపరేషన్ జరిగింది. ఆయన ఇక లేరంటూ నిర్మాత సి. కళ్యాణ్ మీడియాకు చెప్పారు.
దాసరి నారాయణరావు 1947, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించారు. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్ రికార్డులు సాధించారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాక. 53 సినిమాలు స్వయంగా నిర్మించారు. న 250కి పైగా సినిమాలకో మాటల రచయితగా సేవలు అందించారు,. గీతరచయితగా కూడా ఆయన పని చేశారు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించిన ఆయనకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ టునిగా బహుమతి కూడా పొందారు.