Telangana గ్రూప్-2 పరీక్ష మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. లక్షలాది మంది విద్యార్థులు గ్రూప్-2 పరీక్షకు సన్నద్ధమయ్యారు. తెలంగాణ అభ్యర్థులే కాకుండా ఇతర రాష్ర్టాల అభ్యర్థులు కూడా ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఈ నెల 11, 13 తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్ష జరగనుంది. 1,032 పోస్టులకు 7 లక్షల 89 వేల 435 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1916 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్-2 పరీక్షకు టీఎస్పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
🌹గ్రూప్-2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ అల్దిబెస్ట్.
🖌గ్రూప్-2 షేడ్యూల్⏰
☄11న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1(జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్)
☄11న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2(హిస్టరీ, పాలిటి అండ్ సొసైటీ)
☄13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పేపర్-3(ఎకానమీ అండ్ డెవలప్మెంట్)
☄13న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-4(తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్)
☄అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 9.45 గంటల వరకు, మధ్యాహ్నం 2.15 గంటల వరకే అనుమతిస్తారు.
🖌గ్రూప్-2 అభ్యర్థులు ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది..
🖌ఈ రాత్రి నుంచే చదవడం ఆపేయాలి
🖌వీలైతే రివిజన్ మాత్రమే చేసుకోవాలి
🖌కొత్త అంశాల జోలికి వెళ్లొద్దు
💤ప్రశాంతంగా నిద్ర పోవాలి
🖌ఒత్తిడికి గురికావొద్దు
*** ఉదయం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి
🍪నూనెతో తయారైన పదార్థాలు తీసుకోవద్దు
⌚పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి
🖌హాల్‌టికెట్, బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్, గుర్తింపు కార్డు దగ్గర పెట్టుకోవాలి
🖊పై వాటిని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి
📱సెల్ఫోన్లు, ట్యాబ్లెట్లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్, వాచీలు, క్యాలిక్యులేటర్లు తీసుకెళ్లకూడదు
💅🏽షూ ధరించకూడదు, అమ్మాయిలు మైదాకు పెట్టుకోకూడదు
🖌పరీక్షా కేంద్రంలోకి వెళ్లిన వెంటనే ఓఎంఆర్ షీట్‌పై పేరు, హాల్‌టికెట్ నెంబర్ సరిచూసుకోవాలి
🖌తప్పు ఉన్న యెడల ఎగ్జామినర్‌కు సమాచారం అందించాలి
🖌గ్రూప్-2 పరీక్షలో మైనస్ మార్కులు లేవు
🖌ఆలోచించి పరీక్ష రాస్తే విజయం మీదే
🌹👍ఆల్ ది బెస్ట్.👍🌹